మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సందర్శించి, ఆసుపత్రిలో అవసరమైన మార్చురీ, పోస్టుమార్టం గది, ఔట్‌పోస్ట్, డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి సంబంధించిన పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన రోడ్డు నిర్మాణ పనులు, విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనులను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలన్నారు.