వైఎస్సార్ కడప జిల్లా, మైదుకూరు మండలంలోని బ్రహ్మంగారిమఠంలో కొండ సింగరాయ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు నిధులు, అనుమతులు మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను సోమవారం కోరారు. జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించి, వీలైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
బీజేపీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.