విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ఎస్సీకి వినతిపత్రం

1681చూసినవారు
విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ఎస్సీకి వినతిపత్రం
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో, వైఎస్సార్‌ కడప జిల్లాలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సోమవారం ఎస్సీ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు స్ట్రగుల్ కమిటీ నాయకులు దువ్వూరు దేవాన్ష్ కళ్యాణ మండపం నందు తెలియజేశారు. పి.ఆర్.సి కమిటీని వెంటనే ప్రకటించాలని, 3డిఏలను విడుదల చేయాలని, లోకేష్ బాబు ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్