ఆదివారం ఉదయం 8.15 నుంచి 10.45 గంటల వరకు ఖాజీపేట మండల పరిధిలోని 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతు పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఈ అంతరాయం ఖాజీపేట, దుంపలగట్టు, ఏటూరు సబ్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.