చాపాడు కస్తూర్బా గాంధీ పాఠశాలకు రూ.8 లక్షల సిమెంట్ రోడ్డు మంజూరు

239చూసినవారు
చాపాడు కస్తూర్బా గాంధీ పాఠశాలకు రూ.8 లక్షల సిమెంట్ రోడ్డు మంజూరు
మండల కేంద్రమైన చాపాడులోని కస్తూర్బా గాంధీ ఉన్నత పాఠశాలకు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు దాదాపు 8 లక్షల రూపాయల సిమెంట్ రోడ్డు మంజూరు చేయబడింది. మంగళవారం సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. పాఠశాల అభివృద్ధి కొరకు వెంటనే నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు మైనార్టీ పార్లమెంట్ కార్యదర్శి అక్బర్ సలీమ్, ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్