మండల కేంద్రమైన చాపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ
ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మంగపట్నం సుబ్బరాయుడు చైర్మన్గా, సుప్రజ వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వారికి స్థానిక
టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు కూడా అభినందనలు తెలిపి, పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.