ఖాజీపేటలో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ధర బస్తాకు రూ. 267 ఉండగా, అక్రమంగా రూ. 400 వసూలు చేస్తున్నారని వారు తెలిపారు. దీనిపై వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తనిఖీలు చేపట్టి, అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.