గుర్తుతెలియని జంతువు దాడిలో మహిళ మృతి

14చూసినవారు
గుర్తుతెలియని జంతువు దాడిలో మహిళ మృతి
గుర్తుతెలియని అడవి జంతువు దాడిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లిలో చోటుచేసుకుంది. నారపు రెడ్డి బాలసుబ్బమ్మ (65), భర్త వెంకట కొండారెడ్డి, ఉదయం పొలం వద్దకు వెళ్లారు. చెరువు కట్ట కింద ఉన్న అరటి తోట సమీపంలో గుర్తుతెలియని జంతువు ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బాలసుబ్బమ్మకు తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ముఖంపై జంతువు గోళ్లతో రక్కినట్లుగా గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్