నులిపురుగుల నిర్మూలనపై అవగాహన..విద్యార్థులకు మాత్రల పంపిణీ

2545చూసినవారు
నులిపురుగుల నిర్మూలనపై అవగాహన..విద్యార్థులకు మాత్రల పంపిణీ
అన్నమయ్య జిల్లా పీలేరులోని సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రిన్సిపాల్ డాక్టర్ టి. వినీల ఆరోగ్యం, పరిశుభ్రతపై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. రేగళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అమ్మాజీ నులిపురుగుల వల్ల కలిగే వ్యాధులు, వాటి నివారణ మార్గాలను వివరించారు. అనంతరం విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఆర్ సి సమన్వయ కర్త జి. రాధాకృష్ణ, ఎ ఎన్ యం రమాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్