కారు - ఆటో ఢీ.. ఒకరు మృతి

2చూసినవారు
అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలోని వేపులబైలు - జంగంపల్లి నగరి వద్ద కారు - ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్