కలకడ దేవలపల్లెలో చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు ఘనంగా

342చూసినవారు
కలకడ మండలం దేవలపల్లెలో చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలను తొగటవీర క్షత్రియులు, గ్రామస్థులు ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి జ్యోతుల తయారీని మొదలుపెట్టారు. అమ్మవారి అలంకరణ, జ్యోతుల తయారీ, మెరవణి, పద్యం చెప్పడం, పూజా కార్యక్రమాలు అన్నీ మగవారే నిర్వహించడం ఈ ఉత్సవాల ప్రత్యేకత అని స్థానికులు తెలిపారు. రాత్రి జ్యోతులు, అమ్మవారి మెరవణి వైభవంగా సాగనున్నాయి.

సంబంధిత పోస్ట్