వాల్మీకిపురం మండలం కొత్తరెడ్డిగారిపల్లెకు చెందిన రాధా, 1బి పాస్‌బుక్ ఇప్పిస్తానని చెప్పి జరావారిపల్లికి చెందిన వల్లూరు చలపతి రూ. 6. 40 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు. దీంతో తమ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేసి, విచారణ జరిపి న్యాయం చేయాలని అధికారులను కోరారు.