మైనర్ బాలికను గృహనిర్బంధం చేశారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు

5617చూసినవారు
కలకడ మండలానికి చెందిన ఆవుల శిరీష, తన 12 ఏళ్ల కుమార్తెను తన అత్త, మామ అక్రమంగా గృహనిర్బంధం చేశారని ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనపై కలకడ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని ఆమె తెలిపారు. ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు, కుమార్తెకు రక్షణ కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.

సంబంధిత పోస్ట్