రైలు ఢీకొని వృద్ధురాలు మృతి

1627చూసినవారు
రైలు ఢీకొని వృద్ధురాలు మృతి
పీలేరులో చిత్తూరు రోడ్ రైల్వే గేట్ సమీపంలో ట్రాక్‌పై నడుస్తుండగా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో చెన్నారెడ్డి కాలనీకి చెందిన గుండ్లూరి మనోహరమ్మ (68) అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన ఆమెను గేట్‌మాన్ ఆపే ప్రయత్నం చేసినా వినలేదని స్థానికులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్