గుర్రంకొండ: విషం తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం

219చూసినవారు
గుర్రంకొండ: విషం తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం
గుర్రంకొండలో శ్రీనివాసులు (17) అనే యువకుడు గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంగారు ఆభరణాల తయారీ నేర్చుకుంటున్న అతడు, ఇంట్లో నెలకొన్న సమస్యల కారణంగా మనస్థాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్