మంగళవారం కలకడ మండలంలోని గంగాపురం, కత్తివారిపల్లి గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. వరి, వేరుశనగ పంటల్లో చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన రైతులకు వివరించారు. వేరుశనగలో పొగాకు లద్దె పురుగు నివారణకు లీటరు నీటికి 0.3 మి.లీ స్పినోసాడ్ మందును, రసం పీల్చే పురుగుల నియంత్రణకు ఇమిడాక్లోప్రిడ్ మందును పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌కే సిబ్బంది త్రిశూల్, ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు.