కలికిరి: బొలేరో వాహనం ఢీకొని 10 గొర్రెలు మృతి

958చూసినవారు
కలికిరి: బొలేరో వాహనం ఢీకొని 10 గొర్రెలు మృతి
శనివారం సాయంత్రం సోమల–కలకడ రహదారిపై యల్లంపల్లి సమీపంలో బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న సుమారు వంద గొర్రెల మందను వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో పది గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని కలికిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్