అన్నమయ్య జిల్లా, కలికిరి మండలం, కదిరేయకుంట దగ్గరలో నిర్మాణంలో ఉన్న జ్యోతిర్లింగ మహాక్షేత్రాన్ని శ్రీ కాశి పీఠాధిపతి శ్రీ శ్రీ శివ నాగేంద్ర సరస్వతి గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన పీఠాధిపతి, నిర్మాణం పూర్తయిన అనంతరం ఈ క్షేత్రం శివభక్తులకు ప్రముఖ పుణ్యక్షేత్రంగా నిలవాలని ఆకాంక్షించారు. 30 అడుగుల భారీ శివలింగం ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కొనియాడారు. ఆలయ కమిటీ సభ్యులు, భోగేష్ యువకిషోర్, రోహిత్, రాజువారిపల్లి రమణ రెడ్డి పాల్గొని పీఠాధిపతి ఆశీస్సులు పొందారు.