కేవీ పల్లి: పగటి వేళ ఇంట్లో చోరీ – నిందితుల సమాచారం ఇవ్వాలి

844చూసినవారు
కేవీ పల్లి: పగటి వేళ ఇంట్లో చోరీ – నిందితుల సమాచారం ఇవ్వాలి
శుక్రవారం కేవీ పల్లి మండలం గ్యారంపల్లి కస్పా గ్రామంలో పట్టపగలు తాళం వేసిన ఇంట్లోకి చొరబడి బీరువాలోని బంగారు నగలను దొంగలు అపహరించారు. బ్లూ రంగు స్కూటీపై ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈ చోరీకి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. నిందితుల వయస్సు సుమారు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తుల గురించి ఎవరికైనా సమాచారం ఉంటే కేవీ పల్లి పోలీసులకు తెలియజేయాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్