వాల్మీకిపురంలో రోడ్డు ప్రమాదం.. రైతుకు తీవ్ర గాయాలు

339చూసినవారు
వాల్మీకిపురంలో రోడ్డు ప్రమాదం.. రైతుకు తీవ్ర గాయాలు
వాల్మీకిపురం మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జమ్మలపల్లెకు చెందిన చంద్రారెడ్డి (59) అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. బైపాస్ రోడ్డులో బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.