అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.