ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలు మెరుగుపర్చాలి – డీఐవో

264చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలు మెరుగుపర్చాలి – డీఐవో
జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డీఐవో) డా. ఉషశ్రీ గురువారం పీలేరు మండలంలోని తలుపుల పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య సేవలు, సమయపాలనపై మరింత అవగాహన అవసరమని ఆమె సిబ్బందికి సూచించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, ఆరోగ్య సేవల మెరుగుదల కోసం పలు సూచనలు చేశారు. తక్కువ పనితీరు గల సచివాలయాలపై పర్యవేక్షణ పెంచాలని, ‘అభా’ డ్రైవ్ అమలు, వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డా. గిరీషకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్