బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పీలేరులో ప్రత్యేక తనిఖీలు

79చూసినవారు
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పీలేరులో ప్రత్యేక తనిఖీలు
ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పీలేరులో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. లేబర్ ఆఫీసర్ జగదీష్ ఆధ్వర్యంలో విద్య, వైద్య, పోలీసు, శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో దుకాణాలు, వెల్డింగ్ షాపులు, చికెన్ సెంటర్లలో సోదాలు నిర్వహించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా జూన్ నెలంతా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేట్ విజన్ సొసైటీ ప్రతినిధులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, వ్యాపారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్