పీలేరుహోటళ్లపై విజిలెన్స్ దాడులు–9గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

142చూసినవారు
కడప జిల్లా పీలేరు మండలంలోని పలు హోటళ్లపై బుధవారం సాయంత్రం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో జరిగిన ఈ దాడుల్లో బాలాజీ ఫ్యామిలీ, మై ఫిల్, విలేజ్, సన్ రెస్టారెంట్లను పరిశీలించారు. ఈ తనిఖీలలో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉపయోగిస్తున్న 9 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ శివకుమార్ హెచ్చరించారు. ఈ దాడుల్లో డీటీ విజయ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్