ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా విజయ్ కుమార్

10చూసినవారు
ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా విజయ్ కుమార్
పీలేరు రెవెన్యూ డివిజన్ స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన సూర్య పత్రిక విలేకరి కిల్లా విజయ్ కుమార్‌ను పీలేరు పాత బస్టాండ్‌లోని వార్త ప్రాంతీయ కార్యాలయంలో మీడియా మిత్రులు, ప్రజాసంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కులు, సంక్షేమ పథకాలు, సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేదికగా కృషి చేయాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుగా కొనసాగుతూ సామాజిక సమస్యలపై స్పందిస్తున్న కిల్లా విజయ్ కుమార్‌కు ఈ బాధ్యత దక్కడం పట్ల అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్