డబ్బులు కట్టినా నగలు ఇవ్వరా?.. బ్యాంకు ఎదుట మహిళ ఆందోళన

90చూసినవారు
పీలేరులోని కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్ వివాదం శుక్రవారం ఉద్రిక్తతకు దారితీసింది. రుణం పూర్తిగా చెల్లించినప్పటికీ తాకట్టు పెట్టిన బంగారు నగలను ఇవ్వడం లేదని శివమ్మ అనే ఖాతాదారురాలు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. అయితే, ఆమె గతంలో మరో రుణగ్రహీతకు జామీను ఇచ్చిన నేపథ్యంలో ఆ రుణ ఖాతా వ్యవహారం ఇంకా పెండింగ్‌లో ఉందని, బ్యాంకు నిబంధనల ప్రకారం ప్రస్తుతం నగలు విడుదల చేయడం సాధ్యం కాదని మేనేజర్ రిహానా తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడి విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్