ప్రస్తుత వర్షాకాలంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా సాగేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసులు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రొద్దుటూరులో డివిజనల్ స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన, ఈదురు గాలులకు దెబ్బతిన్న లైన్లను వెంటనే రిపేర్లు చేయాలని సూచించారు. డివిజన్లో రూ. 7.38 కోట్ల బకాయిలను పెండింగ్ లేకుండా వసూలు చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ సమీక్షలో ఈఈ, డీఈ, ఏఈ, ఏఏఓలు పాల్గొన్నారు.