ప్రొద్దుటూరు హౌసింగ్ ఏఈ ఆస్తుల అటాచ్మెంట్

557చూసినవారు
ప్రొద్దుటూరు హౌసింగ్ ఏఈ ఆస్తుల అటాచ్మెంట్
ప్రొద్దుటూరు రూరల్ హౌసింగ్ గోడౌన్లో రూ. 1.70 కోట్ల విలువైన 268 టన్నుల స్టీల్ కడ్డీలు మాయమైన కేసులో, సంబంధిత ఏఈ సుబ్రహ్మణ్యం ఆస్తులను అటాచ్మెంట్ చేయడానికి పీడీ కలెక్టర్కు ఫైల్ పంపారు. ఆర్ఆర్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు ఎమ్మార్వోకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సుబ్రహ్మణ్యం కుటుంబ ఆస్తుల వివరాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా గుర్తించి, వాటిని ఫ్రీజ్ చేయనున్నారు. ఈ మేరకు హౌసింగ్ పీడీ రాజారత్నం జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్