వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో తనకంటి జ్యువెలర్స్ షాప్ యజమాని శ్రీనివాసులుపై 17-18 మంది గుర్తుతెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరి షాప్ వద్దకు రాగానే, కొందరు మహిళలు, వ్యక్తులు తనపై దాడి చేసి చంపాలని ప్రయత్నించారని శ్రీనివాసులు తెలిపారు. తృటిలో తప్పించుకొని, షాప్ వర్కర్ల సహాయంతో బయటపడ్డానని, తన తమ్ముడు చేసిన అప్పుల కోసం తనను బెదిరిస్తున్నారని, తాను బాకీ లేకపోయినా కోర్టులో ఉన్న దానికి రూపాయి కూడా చెల్లిస్తానని వాపోయారు. పోలీసుల రక్షణ కోరుతూ ఆయన ఆశ్రయం పొందారు.