ప్రొద్దుటూరులో బుధవారం నియోజకవర్గంలోని 60 మందికి రూ. 35.69 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని, ఆపద సమయంలో వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ భరోసా ఇస్తుందని తెలిపారు. పేదలకు సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.