వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని సోములవారిపల్లె పంచాయతీలో 4వ సచివాలయం పరిధిలో నాగేంద్ర నగర్ నందు ఆదివారం ANM కవిత, ఆశవర్కర్ అనురాధ సమక్షంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 11 గంటల సమయానికి 100 మందికి పోలియో చుక్కలు వేసినట్లు వారు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.