పొద్దుటూరు పట్టణానికి చెందిన ప్రియాంకను నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన ఇండ్ల భరత్ కుమార్ కు 2025 ఆగస్టులో వివాహమైంది. ప్రస్తుతం ఫింగర్ ప్రింట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న భరత్ కుమార్, వివాహం అయినప్పటి నుండి ప్రియాంకను అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. భార్యను కాపురానికి పిలుచుకుపోలేదని, పెద్దమనుషుల పంచాయతీలు చేసినా ఫలితం లేదని బాధితురాలు ప్రియాంక తెలిపింది. ఈ మేరకు ప్రియాంక, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేయబడింది.