ప్రొద్దుటూరులోని వైవీస్ మున్సిపల్ బాలికల పాఠశాల విద్యార్థినులకు బుధవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కంటి అద్దాలను పంపిణీ చేశారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా కంటి సమస్యలున్న విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అద్దాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ గీత, మెడికల్ ఆఫీసర్లు సుమన్, హిమబిందు, రఘురామిరెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.