ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, అర్హులైన చేనేతలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోందని తెలిపారు. ప్రొద్దుటూరులో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, కరెంటు మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ వద్ది సురేఖ, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, టీడీపీ నేతలు పాల్గొన్నారు.