ప్రొద్దుటూరులో సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి సూసైడ్

322చూసినవారు
ప్రొద్దుటూరు సూపర్ బజార్ రోడ్డులో మహబూబ్ బాషా (36) అనే వ్యక్తి శనివారం సెల్ఫీ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2019లో మల్లేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మహబూబ్ బాషాకు ఒక కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో, మల్లేశ్వరి స్థానిక ప్రయివేటు హ్యూమన్ రైట్స్ సంస్థను ఆశ్రయించింది. విడాకులకు ఒత్తిడి చేయడంతో మహబూబ్ బాషా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. ఈ ఘటనపై 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్