కడప పోక్సో కోర్టు ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన బోనాల సుదర్శన రావుపై నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసింది. దీంతో నిందితుడు వెంటనే లొంగిపోవాలని ప్రొద్దుటూరు 2టౌన్ సీఐ వంశీనాథ్ ఆదేశించారు. నిందితుడి ఆచూకీ తెలిసినవారు సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.