మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆరోపించారు. బుధవారం పొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని వరదరాజుల రెడ్డి తెలిపారు.