త్వరలో ఒక్కొక్కరికీ 7 కేజీల రేషన్ బియ్యం: ఎమ్మెల్యే ఆది

2696చూసినవారు
త్వరలో ఒక్కొక్కరికీ 7 కేజీల రేషన్ బియ్యం: ఎమ్మెల్యే ఆది
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి మాట్లాడుతూ, పేదల సంక్షేమమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. సోమవారం జమ్మలమడుగు మండలం పొన్నతోటలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చౌకదుకాణాల ద్వారా ప్రతి లబ్ధిదారుకు అందిస్తున్న 5 కిలోల రేషన్ బియ్యాన్ని త్వరలో 7 కిలోలకు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం పేద కుటుంబాలకు మరింత ఊరటనిస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్