1044 ఎకరాల అటవీ భూముల స్వాధీనానికి చర్యలు: కలెక్టర్ శ్రీధర్

1117చూసినవారు
1044 ఎకరాల అటవీ భూముల స్వాధీనానికి చర్యలు: కలెక్టర్ శ్రీధర్
ప్రొద్దుటూరు మండలం రామేశ్వరం పరిధిలో ఆక్రమణకు గురైన 1044 ఎకరాల అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం డిఎఫ్‌ఓ వినీత్ కుమార్‌తో నిర్వహించిన సమీక్షలో, లోకాయుక్త నోటీసుల నేపథ్యంలో అటవీ చట్టం-1882 ప్రకారం పెన్నా పరివాహక ప్రాంతంలోని అక్రమ కట్టడాలను తొలగించి, భూములను రక్షించేందుకు పటిష్ట ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్