విద్యార్థిని చితకబాదిన టీచర్

0చూసినవారు
విద్యార్థిని చితకబాదిన టీచర్
కడప జిల్లా ప్రొద్దుటూరులోని సంగమేశ్వర ప్రైవేట్ హైస్కూల్లో మంగళవారం, ఆరవ తరగతి విద్యార్థి తమన్‌ను పరీక్షలో జవాబులు రాయలేదనే కారణంతో ప్రైవేట్ టీచర్ చితకబాదాడు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యాన్ని వివరణ కోరగా, వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులో ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు ఎక్కువవుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్