ప్రొద్దుటూరులో డ్రైన్స్ చాలావరకు అక్రమణకు గురికావడంతో పలు చోట్ల వర్షం నీరు పోవడానికి ఆటంకం కలిగిస్తున్నట్లు కమీషనర్ అన్నారు. పట్టణంలో పలు చోట్ల మురుగు కాలవలు వర్షపు నీటితో పోర్లడానికి ప్రధాన కారణం డ్రైన్స్ లో ప్లాస్టిక్ వేయడమని పేర్కొన్నారు. ఉదయం నుండి పలు ప్రాంతాలలో ఉన్న డ్రైన్స్ లో సిల్ట్ తీసే పనిలో పారిశుధ్య కార్మికులు నిమగ్నమయ్యారు. ఉద్యయం 4 గంటల నుంచి కమీషనర్ ఆధ్వర్యంలో సిబ్బంది పలు ప్రాంతాలు తనిఖీ చేసి, డ్రైన్స్ మీద అక్రమ కట్టడాలపై వ్యాపారులు చేస్తున్న యజమానులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డ్రైన్స్ మీద ఉన్న అక్రమ కట్టడాలకు ప్లాన్ రెడీ చేయాలని టౌన్ ప్లానింగ్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు.