ప్రొద్దుటూరు టౌన్ పోలీస్ స్టేషన్లో తప్పిపోయిన 6 సంవత్సరాల బాలుడు క్షేమంగా ఉన్నాడని, తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్లాలని ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి ఆదివారం తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒంటరిగా కనిపించిన బాలుడిని పోలీసులు చేరదీసి రక్షణలో ఉంచారు. బాలుడి పేరు లక్కి, తండ్రి రాజేశ్, తల్లి రేణుక అని, ఆళ్లగడ్డకు చెందినవాడని చెబుతున్నాడు. సంప్రదించాల్సిన నంబర్లు: CI-9121100590, SI-9121100591.