కడప అటవీశాఖ అధికారులు మైదుకూరులో వన్యప్రాణులైన ఒకటి దుప్పి, ఐదు పులి చర్మాలతో పాటు పులి గోర్లు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. శాంతినికేతన్ స్కూల్ వెనుక భాగంలో ఉన్న నివాసంలో ఈ విక్రయాలు జరుగుతున్నాయని అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో బద్వేల్, ప్రొద్దుటూరు రేంజర్ల ఆధ్వర్యంలో ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చర్మాలను, పులి గోర్లను హైదరాబాద్లోని CCMB వన్యప్రాణుల విభాగం వద్ద DNA పరీక్షల కోసం పంపిస్తామని కడప DFO రాజశేఖర్ బాబు తెలిపారు.