
నందిశ్వర ఆలయ ప్రతిష్టకు సజ్జల రామకృష్ణ రెడ్డికి ఆహ్వానం
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో కడప జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ మార్తల అశోక్ కుమార్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిబ్రవరి 23 నుండి 27 వరకు కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో జరగనున్న నందిశ్వర ఆలయ ప్రతిష్టా కార్యక్రమానికి సజ్జలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి, గ్రామస్తులు అమర్నాథ్ రెడ్డి, ఓబులరెడ్డి కూడా పాల్గొన్నారు.



































