పులివెందులలో 8 మంది జూదరుల అరెస్ట్

228చూసినవారు
పులివెందులలో 8 మంది జూదరుల అరెస్ట్
పులివెందుల పట్టణంలోని క్రిస్టియన్ లైన్ ప్రాంతంలో జూదం ఆడుతున్నారనే సమాచారంతో అర్బన్ సీఐ శ్రీరామ్ సోమవారం తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 12,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పులివెందుల పట్టణ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్