పులివెందులలో వైభవంగా పీర్ల ఊరేగింపు

1256చూసినవారు
పులివెందులలోని స్థానిక జెండామాను వీధిలో ఆదివారం సాయంత్రం మస్తాన్ పీర్ ఊరేగింపు వైభవంగా జరిగింది. పీర్ల చావిడిలో ప్రత్యేకంగా అలంకరించిన మస్తాన్ పీరును డప్పు వాయిద్యాల మధ్య పుర వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పీర్లను దర్శించుకుని చక్కెర చదివింపులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఊరేగింపుతో పాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్