ఎంపీ అవినాష్రెడ్డి శుక్రవారం పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు.
వైసీపీ నిర్వహిస్తున్న నిరసన ర్యాలీకి ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూస్తుంటే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం స్పందించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఏమి సాధించారని విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారని ఆయన ప్రశ్నించారు.