పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. రైతులకు రావాల్సిన రూ. 40,000 అన్నదాత సుఖీభవ పథకం నిధులను ఎక్కువ మందికి ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి రూ. 3,000, ఆడబిడ్డలకు రూ. 1,500 పథకాలను అమలు చేయకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు.