వేంపల్లి మండలం బక్కన్నగారిపల్లెకు చెందిన గిరిజన విద్యార్థి ధార్మిక్ వెంకట్ నాయక్, ఐఐటీలో ఆల్
ఇండియా 27వ ర్యాంక్ సాధించి చెన్నై ఐఐటీలో సీటు పొందారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి ఆయనను ఘనంగా సన్మానించారు. మారుమూల ప్రాంతం నుంచి దేశ స్థాయిలో ర్యాంక్ సాధించడం గర్వకారణమని అభినందిస్తూ, భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్లో రాణించి ఐఏఎస్ గా ఎదిగి గ్రామానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.