బుధవారం పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, అమరావతి పేరుతో భారీగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు, ఫీజురీయింబర్స్మెంట్, పంట బీమా వంటి ప్రజా ప్రయోజన పథకాలకు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.